పుట:2015.372412.Taataa-Charitramu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చుచున్నప్పు డొకపెద్ద యాంగ్లోద్యోగి అన్యాయముగ తనతో దుర్భాషలాడగా, ఆతని నెదిర్చి, తాను కారాగృహముకు పోవుటకుగూడ సిద్ధమై, ఆతడు తనకు అసందిగ్ధముగ క్షమార్పణ చేసికొనువర కావిషయమును వదలలేదు. ఆంగ్లేయుల నౌకలందు భారతీయులను న్యూనముగ జూతురనియు, వారికేవులు మాత్రము హెచ్చుగ నుండుననియు గమనించి, జంషెడ్జి ఆంగ్లే తరములగు జర్మను మున్నగువారి నౌకలపైననే సాధారణముగ ప్రయాణము చేయుచుండెను.

ఆయన కార్యదీక్ష మూడవ సుగుణము: జంషెడ్జి సామాన్యకుటుంబమందే జనించెను. ఆయనతండ్రి గొప్ప యైశ్వర్యవంతుడు కాడు. వ్యాపారజీవనమున అదృష్టమే ప్రధానమని కొందరు భావింతురు. అదితప్పు, జంషెడ్జి కదృష్టలాభమొకప్పుడు కలుగుచుండినను, చాలసారు లాయనకు అదృష్టపూర్వములగు నష్టములును కలిగెను; దూది యెగుమతి వ్యవహారము చేయుచో, 1865 లో, ఆయన లండనులో చాలసరుకు నిలవజేసి, అచట క్రొత్తగా బ్యాంకునుగూడ స్థాపించుచుండినప్పుడు, అమెరికా సంధిచే పరిస్థితులు హఠాత్తుగ విషమించి, తోటి కంపెనీలు దివాలాతీయగా, తాతాకును ఆర్థికస్థితి చాల క్లిష్టమయ్యెను; అప్పుడు బొంబాయిలోను, ప్రేమచందురాయచందు బ్యాంకు దివాలావలన, తాతాకు చాలనష్టముకలిగెను. 1887 లో, స్వదేశీమిల్లు స్థాపనకై కుర్లాయొద్దకొనిన 'ధరంసీ'