పుట:2015.372412.Taataa-Charitramu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18. తాతాస్వభావము.

తాతాగారి జీవితపు ముఖ్యసంగతు లిట్లు పైయధ్యాయములందు వివరింపబడినవి. అందు, చాలవరకు, ఆయన స్వరూపస్వభావములును సూచితములు. అందలి ముఖ్యసంగతుల నిచట స్మరింతము.

జంషెడ్జితాతా కొంచెము పొట్టియై, చామనచాయవర్ణము సౌమ్యమగు ముఖవర్చస్సు గల్గియుండెను. ఆయనశరీరము దేఢమైనదే; ఆయనమనోబలము, సహృదయత, అద్భుతములు. ఆయన తన నిత్యకృత్యములను సకాలముగ జేసికొను నలవాటు గల్గియుండెను. ప్రతిదినమును, ఉష:కాలముననే లేచి, సముద్రతీరమున బాలసూర్యుని దర్శించి, అచట కొంతసేపు నడచి, కాల్యకృత్యములన్నిటిని దీర్చుకొనును; ఉదయము 8 గంట లగునప్పటికే, తనగుర్రపుబండిపై నెక్కి, ఆయన కొందరుమిత్రుల యిండ్లకు బోయి, వారితో మాట్లాడును; అప్పటికి వారు తరుచు పడకనుండి లేవబోవుచుండిరి. అటనుండి తిరుగవచ్చి, ఉదయభోజనము కాగనే, తొందరవ్రాతపనియున్న, దానిని స్వయముగ చేసికొనును; లేనిచో నేదేని చదువుకొనుచుండును. మధ్యాహ్నము తనకార్యాలయమునకు బోయి, అచట సాయంకాల మారుగంటలగువర కతిశ్రద్ధతో తన వ్యవహారముల జేసికొనును; అంతట నొకగంట విహారముకు పోవును; లేదా క్లబ్బులో మిత్రులతో సంభాషించును; అంతట