పుట:2015.372412.Taataa-Charitramu.pdf/165

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శిలాప్రతిమ 1912 లో స్థాపింపబడి, అప్పటి బొంబాయి గవర్నరుచే బహిరంగము చేయబడెను.

తనకు శిలాప్రతిమను జ్ఞాపికలను నెలకొల్పుట జంషెడ్జి కెంతమాత్రము నిష్టముకాదు; అది యాయన ప్రకృతికే వ్యతిరిక్తము. కాని యాప్రతిమ ముందుతరముల యువకులందరకు పారిశ్రామిక జీవనముకు జాతీయోద్ధరణకు నుద్భోధకముగనుండును. ఆయనకు నిజమైన జ్ఞాపకచిహ్నములు బెంగుళూరులో, జంషెడ్పురమందు, నాగపురమున, బొంబాయి అహమ్మదాబాదులలో, ఇట్లు మనదేశమం దన్నిప్రక్కలను ఆర్థికోపకారకమగు సంస్థల రూపమున నేర్పడియేయున్నవి. భారతీయులుగూడ తదేకదీక్షతో పనిచేయు నెడల స్వయంకృషివలననే మనదేశమున పెద్దపరిశ్రమల నడపి, వానిని పాశ్చాత్యసంస్థలకు తీసిపోకుండునట్లు జయప్రదముగ జేయవచ్చునని, ఈసంస్థలును ఆశిలాప్రతిమయు జ్ఞప్తికి తెచ్చుచుండును._________