పుట:2015.372412.Taataa-Charitramu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిత్రులింకను చాలకాలము జీవించిరి; కాని, భారతీయప్రముఖులలో చాలమంది షష్టిపూర్తికాకుండగనే మరణించుటయు, వారిప్రజ్ఞానుభవములు దేశమునకు పూర్తిగ వినియోగింపక పోవుటయు, శోచనీయ విషయము. ఆంగ్లదేశమందు 65 ఏండ్లు నడివయస్సుగనే భావింపబడును.

జంషెడ్జితాతా మరణవార్త వెంటనే ప్రపంచమంతటను తంతిద్వారా వ్యాపించెను. అది భారతీయులను శోకసాగరమున ముంచెను; మనదేశమం దన్నిప్రాంతములందును విచారసూచక సభలుజరిగి, జనులదు:ఖము తెలుపు తీర్మానములు చేయబడెను. తరువాత కొంతకాలమునకు జంషెడ్జి స్థాపింప యత్నించుచుండిన లోహపరిశ్రమ జలవిద్యుచ్ఛక్తి పరిశ్రమ సాధింపబడి, వాని జాతీయ ప్రాముఖ్యము జనులకు బోధపడెను. అంతట జంషెడ్జి తాతాగారికి స్థిరమగు స్మారకచిహ్న మేర్పర్చుట యుక్త మని జనులు నిశ్చయించి, కొందరుప్రముఖుల నందుకొక సంఘముగా నేర్పర్చిరి. అందుకు చందాలవలన 47000 రూపాయలు వసూలాయెను. ఆస్మారకచిహ్న మేరీతిగనుండవలెనని కొంతచర్చజరిగి, తుదకు ఆయన జీవితకృషికి ముఖ్యరంగస్థలమైన బొంబాయినగర మధ్యమున స్థలముతీసికొని, అందు ఆయనశిలాప్రతిమను నెలకొల్పుటకు, నిశ్చయింపబడెను. ఆప్రకారము బొంబాయిలో బి. ఐ. పి. రైల్వేకంపెనీవారి కార్యాలయము నెదుట, విశాలవీధుల కలియుచోట, మధ్యస్థలమందు, జంషెడ్జి తాతాగారి