పుట:2015.372412.Taataa-Charitramu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16. అంత్యదశ.

వ్యవసాయము తరువాత, మనదేశపు పరిశ్రమలన్నిటిలో నెక్కువముఖ్యము, హెచ్చుమందికి జీవనాధారమైనది, దూదిబట్టల పరిశ్రమ. దానివృద్ధికై, నాగపురం, బొంబాయి, అహమ్మదాబాదు, ఈమూడునగరములందును ఆధునికపద్ధతులపైన ఉత్తమరీతివగు దూదిబట్టలమిల్లులను జంషెడ్జితాతా స్థాపించెను; ఆదర్శరూపమగు వ్యాపారనీతినే యవలంబించి, అందు తనమిత్రులను, విద్యావంతులగు యువకులను, తరిఫీయతు చేసెను; అంతట తనజోక్య మక్కరలేకుండ, ఆయనయుద్యోగులే ఆపరిశ్రమల నడుపుకొనజొచ్చిరి.

అందుచే గలిగిన విశ్రాంతిని తాతా ఆపరిశ్రమవృద్ధి సందర్భమున అన్నిమిల్లులకును గలిగిన మహాసమస్యల పరిష్కారముకు వినియోగించెను: అవి కార్మికసమస్య, నౌకావ్యాపారము, ప్రశస్తమగు ప్రత్తిసాగు, బట్టలపన్ను మున్నగునవి; ఈసమస్యల చర్చను సవ్యమార్గమున జరిగించి వానిననుకూలముగ బరిష్కరించుటకు, ఆయన చాలదూరదృష్టితో వర్తించి, విశేషకృషి చేయుటయేగాక, తోటిమిల్లుదార్లయొక్కయు ప్రభుత్వాధికారుల యొక్కయు సహకారమును సంపాదించుట యత్యవసరమయ్యెను. తాతా కుండిన పరిజ్ఞానము, దేశాభిమానము, దూరదృష్టి, తక్కినమిల్లుదార్లకు తరుచు లేకపోవుటయు, అందువలన తాతాగారికృషికి వెంటనే పూర్తియగుఫలము కలుగక