పుట:2015.372412.Taataa-Charitramu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బడవలెను. అందుకు చాల మూలధనము ఒక్కసారిగా కావలసి వచ్చెను.

పెద్దపరిశ్రమలు లేని మనదేశమున, సందేహగ్రస్తమగు నావిచిత్రపరిశ్రమకై అంతమూలధనము దొరకుట దుర్ఘటము. అందువలన, పరిశ్రమలతో నొప్పుచు ధనముతో తులతూగుచున్న ఆంగ్లదేశపు లండనులోనే ఈసంఘమును స్థాపించి, అందు చాలమంది విజ్ఞులగు ఆంగ్లేయుల సభ్యుల యజమానులుగ జేర్చుకొని, వారిద్వారా ఆంగ్లకోటీశ్వరులనుండి మూలధనము సేకరించి, ఈయుద్యమము సాగింపవలయునని తలచి, దొరాబ్జి తన యాంగ్లమిత్రులసహాయముతో లండనులో నట్టిసంఘము స్థాపించి, ద్రవ్యముకై ప్రకటనలజేసి, మనసార యత్నించెను. అచట ధనము చేకూరినచో, ఈపరిశ్రమ యాజమాన్యము, లాభమును, చాలవర కాంగ్లేయుల హస్తగతమై యుండును. మూడేండ్లు యత్నించినను, కొన్ని కారణములవలన, ఆమూలధన మాంగ్లదేశమున చేకూరలేదు. ఈయదృష్టఫలితమున దొరాబ్జి నిరాశుడై, తిరిగివచ్చెను.

ఈలోగా మనదేశమున స్థితి మారి, 'స్వదేశీ^' యుద్యమము క్రమముగా దేశమంతటను నాటుకొనెను. తాతావారి లోహపరిశ్రమ స్థాపితమై, పనిచేయ నారంభించెను. అందువలన