పుట:2015.372412.Taataa-Charitramu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టెట్లు? ఈమూడునెలలలోను పడు మహావర్షపు సమృద్ధజలము వ్యర్ధముగ సాగరములోనికి బోకుండ, కొండలపైననే చాల యెత్తగు మహాసరస్సుల నిర్మించి, అందు విశేషజలమును నిలవజేసి, క్రమముగా నందుండి యవసరమగునంత నీటి ప్రవాహము నొకచోట కొండయంచుకు రప్పించి, అటనుండి క్రిందకు గొట్టములద్వారా జలధార వేగముగ బడునట్లు చేయవలెను. పూర్తియైన జయము కలుగవలెనన్న , రెండుమూడేండ్లు వరుసగ నెప్పుడైన ననావృష్టికలిగి, తగినంతవర్షము పడకున్నను; అప్పటివరకును చాలునంత నీరుకూడ నాకొండలమధ్య నిలవజేసి యుంచవలెను.

అందువలన, వారాలోచించి, మొదట తలపెట్టిన 'లోనవ్లా' ప్రాంతమునేగాక, దాని కాగ్నేయమందున్న 'వల్వాను' కొండను, దానికిని ఆగ్నేయదిశదగు 'షిరాటా' కొండను, వీనిమధ్యనున్న లోయలన్నిటినిగూడ కొని, ఆలోయలనుండి నీరు ప్రక్కలకు తెగిపోకుండ, చాల యెత్తగు బలమైన రాతిప్రాకారముల గట్టుటకు నిశ్చయించిరి. ప్రశస్తమగు యంత్రములను, ఎన్నటికిని చెడని బలీయమగు ఉక్కుగొట్టములు మహోన్నతమగు స్తంభములు తీగలు మొదలగు చాల ఉపకరణములను, హెచ్చువెలకు తేవలసియుండెను. కార్యమంతను విజ్ఞులు జగద్విఖ్యాతులు విదేశములం దట్టి కార్యములలో విశేషానుభవము సంపాదించినవారునగు ఇంజనీర్లచే జరిగించ