పుట:2015.372412.Taataa-Charitramu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాయన పుత్రమిత్రులపై బడెను. జంషెడ్జి ఈమహోద్యమములోని ఆనుపానులను వారికి మొదటినుండి తెలిపి, వారి కాకార్యక్రమపునిర్వహణమున పూర్తియగు శ్రద్ధను ధైర్యోత్సాహములను కలిగించెను. మిల్లరుగోస్లింగులతో నేర్పడిన సంఘమందు తనతో బాటు జ్యేష్ఠపుత్రుడగు దొరాబ్జినికూడ సభ్యునిగ చేర్చెను. అందువలన, ఆయనయనంతర మాయుద్యమమును విడువక, దొరాబ్జియు మిత్రులును సాధించి, జయప్రదముగ నడుపగల్గిరి. 1907 నందే ప్రభుత్వమునుండి ఆపరిశ్రమ స్థాపనకు వలయు లైసెన్సు లభించెను.

కాని గొప్ప యింజనీర్లచే నాకొండస్థలము లన్నిటిని పూర్తిగా పరీక్షింపజేసినమీదట, వివరములగూర్చి కొన్ని చిక్కులు కన్పట్టెను. మిల్లులకు, మునిసిపాలిటికి, ఇతరసంస్థలకు, విద్యుచ్ఛక్తి సప్లైచేయుటకు ఖరారుచేయుచో, మధ్య నెన్నడు నావిద్యుచ్ఛక్తి సప్లై నిల్చిపోకుండ తగు కట్టుదిట్టముల జేయవలెను. (అట్లు తప్పిపోయినయెడల, ప్రజలకు అసౌకర్యము కల్గును; మరియు తాతావారు ఆసంస్థలకు చాల నష్టపరిహార మీయవలసియుండును.) నయాగరా శివసముద్రములందువలె నిచట సహజనదీప్రవాహము లేదు. బొంబాయిప్రాంతపు కొండలపైన వేయిదుక్కులకుపైగా వాన కురియును. కాని అందు చాలభాగము వర్ష కాలపు మూడునెలలోనే పడును. తక్కిన 9 నెలలందును, నిరంతరముగ జలధార కొండలనుండి పడు