పుట:2015.372412.Taataa-Charitramu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభుత్వమునకే అధికారముకలదు. †[1] అందుకు ప్రభుత్వసానుభూతి అవసరము. తనప్రణాళికకు పూర్తియగు వివరములను ఆయుద్యమముచే బొంబాయినగరపు జనులకు చుట్టుపట్లజిల్లాల భూస్వాములకు, రయితులకు, గలుగగల లాభములను వివరించుచు, జంషెడ్జి లండనులో హమిల్టను ప్రభువునకొక పెద్దరిపోర్టునంపెను. దానివిశేషమును గమనించి, భారతమంత్రి దానిని తన యాశీర్వాదముతో బొంబాయిగవర్నరు కంపెను. అంతట జంషెడ్జి గవర్నరుతో చాలసార్లు సంప్రతించి, తనయత్నములచే నాప్రాంతములకు లాభము కలుగునని గవర్నరుకు విశదముచేసి, ఆయనకు తృప్తి కలిగించెను. 1903 లో అమెరికా వెళ్ళినప్పు డచ్చటి నయాగరా జలపాతము మున్నగువానినిజూచి, అందు విద్యుచ్ఛక్తి పరిశ్రమ నాయకులనుండి చాలసంగతుల గ్రహించెను. ఇట్లు నిరంతరపరిశ్రమతో నాయుద్యమమునకు పునాదివేసి, ఆమహోద్యమమును నిర్వహించుటకై తొందరగ యత్నించుచుండగనే, 1904 లో జంషెడ్జి చాలవ్యాధిగ్రస్తుడై, మేనెల 19 వ తేదిని మరణించెను.

ఈయాపత్తుచే బంధుమిత్రులు శోకసంతప్తులైరి. ఆయుద్యమమును తరువాత జయప్రదముగ స్థాపించినడుపు భార

  1. † వ్యక్తులకు హక్కగు ఆస్తిని నిర్బంధముగ కొనుటకు వ్యక్తుల కధికారములేదు. అది పబ్లికు కార్యములనిమిత్తము కావలెనని గజెట్టులో ప్రకటించి, 'లాండు అక్విజిషను ఆక్టు' ప్రకారము చర్యజరిపి, తగుకిమ్మతునిచ్చి, ప్రభుత్వమువారు మాత్రము నిర్బంధముగాగూడ ఆయాహక్కు దార్లనుండి తీసికొనవచ్చును. రైలు గ్రామ నివేశనములు మున్నగు వాటికై యిట్లే చేయుదురు.