పుట:2015.372412.Taataa-Charitramu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొన దగుననితోచి, తాతా మిత్రులగు కీ. శే. సర్ డిన్షావాచా గారు రచించిన Life and Life work of J. N. Tata నుండియు పత్రి కావ్యాసములు మున్నగు వానిని బట్టియు, 1917 లో నొకపుస్తకమును వ్రాసియుంటిని. దానిని నామిత్రులగు కావ్యనిధి శ్రీ చెలికాని లచ్చారావుగారు 'తాతా జీవితము' అను పేరుతో 1921 లో శ్రారామ విలాసగ్రంధమాలలో అచ్చువేయించిరి. అనేకగ్రంథముల బ్రచురించియు, పండితసహాయ మొనర్చియు, ఆంధ్రభాషకు సేవయొనర్చిన శ్రీ లచ్చారావుగారు 1923 లో అకాలమరణము నొందిరి. ఆపుస్తకము మరల నచ్చు పడలేదు.

'తాతా జీవితము' వ్రాయునప్పటికి, మనయార్ధిక పరిస్థితి బాగుపడుటకై ఆవశ్యకవస్తువులన్నిటికిని ఆధునిక పాశ్చాత్య యంత్రములతో పెద్ద 'ఫాక్టరీ' లనేర్పర్చి, అట్టిపరిశ్రమలను మన దేశమందును స్థాపించుటే మార్గమనుభావము సర్వసామాన్యముగ వ్యాపించియుండినది. కాని, 1921 నుండి దేశమున నూతన జాతీయభావముకలిగి, ఆధునికయాంత్రిక పద్ధతి హానికరమనియు, చేతిపనులనే వృద్ధిచేయించి, వానినే గ్రామములందు ప్రోత్సహించవలెననియు, ఒక సిద్ధాంతము బయలుదేరినది. కేవలయాంత్రిక నాగరికత, మనదేశమున కొంతహానికరముగనే ఉన్నది. †[1] అందు

  1. † ఈసమస్యవిషయమై (ప్రపంచ చరిత్రను గూర్చి నేను వ్రాసిన 'జగత్కథ' లో 544 - 547, 648 - 650 వ పుటలందు కొంతవివరింపబడినది.