పుట:2015.372412.Taataa-Charitramu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మున్నగు దేశముల పెద్దయంత్రాలయములనుండి రప్పింపబడిరి. వారికి చాల హెచ్చుజీతము లీయబడును. *[1] వారు పెద్దయుద్యోగులగుటవలన, అచటి వ్యవహారముల నడుపుటలో నాపాశ్చాత్యులకు పలుకుబడియుండుట సహజము; కాని కంపెనీ యాజమాన్యము భారతీయులదే.

అందలి కార్మికులకు సముపాయమునకై చిల్లరవైద్య సహాయమును సోడానీరుమున్నగు వానిసౌకర్యమును, ఆకంపెనీవా రుచితముగనే కలిగించుచున్నారు. బియ్యము మున్నగు నిత్యాహారపు వస్తువులను కంపెనీవారే కొని యుంచి, ప్రత్యేకపు చౌకధర కందజేయుదురు. అచటి నీటిపన్ను, దొడ్డిపన్ను, దీపపుపన్ను మున్నగునవి ఆగృహములందు వసించు వ్యక్తులు భరింపనక్కరలేదు. నగరపు మునిసిపలుఖర్చు చాలవరకు కంపెనీవారే (కొంతవరకు ఇటీవల నచట నేర్పడిన 7 కొత్త కంపెనీలును) భరింతురు. అచటి ప్రజాప్రతినిధులు ఇప్పుడు కొంతవరకు నగరయాజమాన్యము వహించియున్నారు. విద్యా వ్యాయామ సమావేశాదులకై చాల క్లబ్బు లేర్పడినవి.

  1. * ఇప్పుడున్న పాశ్వాత్యులనుగూడ చాలవరకు తగ్గింపవలెనని, వారు చేయుపనులలోగూడ కొన్నింటిని నిర్వహింపగల సామర్ధ్యము ఇప్పుడు భారతీయులకును కలదని, అందువలన చాల హెచ్చుజీతముల నిచ్చి విదేశీయులనే పెద్దయుద్యోగులుగ నుంచుట యవసరముకాదని, చాలమంది భారతీయుల అభిప్రాయము. పాశ్చాత్యోద్యోగులకు చాల హెచ్చుజీతముల నీయవలసి వచ్చుటచే, కంపెనీ సిబ్బందిఖర్చు చాల హెచ్చుగనున్నది.