పుట:2015.372412.Taataa-Charitramu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆపురమున కొత్తకొత్త అనుబంధ పరిశ్రమలింకను ఏర్పడుచున్నవి. ఇంకను కొత్తపనివాండ్రు వ్యాపారస్థులు చేరుచున్నందున, ఆపురమింకను వేగముగ వృద్ధియగుచున్నది. 1919 లో, అప్పటి రాజప్రతినిధి యగు షెమ్స్‌ఫర్డ్‌ప్రభు వాపురమునకు వచ్చెను, అప్పు డానగరమునకు పూర్వపు కుగ్రామనామమగు 'సాక్షి'కి బదులు, 'జంషెడ్‌పుర'మని పేరుపెట్టిరి. అచట యూరపియనులు మున్నగు పెద్ద ఉద్యోగులు వసించుపేటకు మాత్రము 'తాతానగర్‌' అని పేరుంచబడెను. అప్పటినుండి యావిచిత్రనగరముకు 'జంషెడ్‌పుర' మనియే వాడుక. ఇట్లు జంషెడ్జి తాతాగారి పారిశ్రామికప్రతిభ కానగరము స్మారక చిహ్నమైనది.

ఈపురము సార్వజనికము; ఇందు పాశ్వాత్యులు, చీనులు, భారతీయులలో అన్నిప్రాంతముల వారును, కలరు. భారతీయైక్యముకు నిదియొక చిహ్నము. ఇం దిప్పటికిని కొందరు పెద్ద యుద్యోగులు పాశ్చాత్యులే; కాని కొంతవర కిటీవల భారతీయులే పూచీతోగూడిన నిర్వహణకార్యములగూడ నిర్వహించుచున్నారు. విద్యుచ్ఛక్తి వైద్యశాఖ మున్నగు కొన్నిశాఖల ప్రవర్తకులు భారతీయులే. తక్కిన కొన్నిశాఖల నిర్వాహకులు, ప్రత్యేకనిపుణత విశేషవాస్తువిజ్ఞానము కావలసిన ప్రధానోద్యోగులును, ఇప్పటికిని విదేశీయులే, ఇందుకు వలయు ప్రత్యేకనైపుణ్యపరిజ్ఞానములు విదేశీయులకే కలవను భావమున, వారు దీర్ఘకాలపు షరతులపైన ఇంగ్లండు, జర్మనీ, అమెరికా,