పుట:2015.372412.Taataa-Charitramu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములు సుఖకరములు నగు రమ్యకుటీరములను శుభ్రమగు విశాలవీధులలో నిర్మించుచుండెను. ఆయనకుమారుడు దొరాబ్జియు మిత్రులగు మిగిలిన డైరక్టరులును ఆప్రకారమే యచటి పనివాండ్రకై ప్రత్యేకవసతులతో పేటలనిర్మించిరి; అంతేగాక తక్కినవారి వాసముకొరకును నగరమంతను తామే కట్టించుట యుచితమని గ్రహించి, అందలి యుద్యోగులు మున్నగువారికిని వీలుగనుండునట్లు సరియగు నేర్పాటులతో, ఆధునికపుర నిర్మాణపద్ధతిని ఒక ప్రత్యేకపురము నంతను నిర్మించిరి. అచట ఖాళీస్థలము సమృద్ధిగ కలదు; అందు 25 మైళ్ళస్థలమున నా నగరము విశాలముగ కట్టబడినది. ఇప్పటికిని అందు 4500 గృహము లీకంపెనీవారివే; అందు పెద్దయుద్యోగుల కనుకూలముగ పాశ్చాత్యపద్ధతిని చుట్టును తోటలతో బంగాళాభవనముల గట్టి, ఒకపేట నేర్పర్చిరి. *[1] సామాన్యపు జీతగాండ్రగు మధ్యరకపు భారతీయులకు వారి సంసారములకును వీలగునటుల, చక్కని భవనములు మనదేశీయావసరములకు వలయు సౌకర్యములతో గట్టబడి, ఒక చక్కనిపురముగ నేర్పడినది. వీధులు విశాలముగ సరియైన వరుసపంక్తులుగ నుంచుబడెను. అచటి సువర్ణ రేఖ నది కానకట్టను కట్టించి, దానినీటిని ఎత్తగు మిట్టపైన నిర్మించిన ప్రత్యేకపు చెరువుల కెక్కించి, అందుండి నగరముకంతకు కొళా

  1. * ఇదియే తరువాత 'తాతానగరము' అని పిలువబడుచున్నది అచటి రైలుస్టేషనుకును 'కలిమాటి' అను పేరుకు బదులు 'తాతానగర్‌' అనిపేరు పెట్టబడినది.