పుట:2015.372412.Taataa-Charitramu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కులు మాత్ర మరుదు. ఆధ్యాత్మిక రాజకీయములందు ప్రజ్ఞ యెంతయున్నను, ఆర్ధికపరిస్థితి బాగుగలేనిచో, నేలవిడచిసాము చేయు నట్లుండును; అట్టిస్థితిలో, ఏవిషయమందును సంఘము సరిగ వృద్ధి జెందదు. అందుకు, చీనాభారతదేశముల ప్రస్థుతస్థితియే ప్రబల నిదర్శనము. ఆర్ధికపరాధీనత రాజకీయ వశత కన్నను ఎక్కువ హానికరమని ప్రాజ్ఞులగు మహనీయుల యభిప్రాయము.

ప్రస్తుతకాలమున మనయిండ్లలో సాధారణముగా వాడు వివిధవస్తువు లేదేశపువో పరీక్షతో గమనించుచో, మనమెట్టి ఆర్ధికదుర్దశలో నున్నామో స్పష్టమగును. విదేశీయులు విజ్ఞాన సహాయమున తమ దేశములందు మహాయంత్రముల నిర్మించి, అందు బహులోత్పత్తి మూలమున చౌకగ వస్తువులను తయారు జేసి మనకంపుచున్నారు. వానిదిగుమతిని నిరోధించుట సాధ్యము కాదు. వాని వాడుక హెచ్చుటచే, ఇచటి దేశీయపరిశ్రమలు నశించినవి; కొన్ని మూలకుతొలగినవి. ఇటీవల సుమా రేబదియేండ్ల నుండి మనదేశమునను కొలదిమంది పారిశ్రామికులు పాశ్చాత్య పద్ధతినే వైజ్ఞానికముగ యంత్రాలయముల నేర్పరచి, పరిశ్రమల స్థాపించి, కొన్ని వస్తువులను తయారుచేయుచున్నారు. వారిలో నగ్రగణ్యుడు 'జంషెడ్జి నస్సర్వంజీ తాతా'. ఈయన దూరదృష్టి, బుద్ధికుశలత, వ్యాపారదక్షత, దాతృత్వము, మన దేశమం దసమానములు. ఈయన పారిశ్రామికరంగమున సాటిలేని కర్మ వీరుడు; ఈమహానీయునిచరిత్రము నాంధ్రులందరును తెలుసు