పుట:2015.372412.Taataa-Charitramu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అచట 'లోహర' యనుచోట లోహఖనియు, సమీపమున 'వరోర' లో నేలబొగ్గుగనియు కలవని, కానివానిని పనిచేయుటకు ప్రతిబంధము కలదనియు, అందు తెలుపబడెను. జంషెడ్జి వెంటనే యాలోహముకు బొగ్గుకు మచ్చులను తీసుకొనివెళ్ళి, వానిని స్వయముగ జర్మనీలో గొప్పలోహయంత్రశాలలందు వైజ్ఞానికముగ పరీక్ష చేయించెను. వానితో మంచియుక్కు తయారగునని తేలెను. వెంటనే స్వదేశముకు తిరిగివచ్చి, ఆయన మధ్యరాష్ట్రపు గవర్నరగు మారిసుదొరగారితో మాట్లాడి, ఆగనులస్థలములను, ఆప్రాంతమందున్న 45 మైళ్ళ బ్రాంచిరైలులైనునుగూడ తనకు కవులుకిమ్మని కోరెను. (బలువగు నావస్తువుల జేరవేయుటకా రైలులైనుకూడ అవసరము) ఎంప్రెసుమిల్లు స్థాపకుడై మధ్యరాష్ట్రముకు మహోపకారము చేసిన తాతా యందు గవర్నరుకు గౌరవమే; కాని భారతప్రభుత్వమువారా రైలులైను నెవ్వరికిని కవులుకిచ్చుటకు నిరాకరించిరి. అందుచే నాప్రయత్న మంతటితో నిల్చిపోయెను.

కాని, తాతా యధైర్యము జెందక, తరువాతగూడ లోహపరిశ్రమకై పరీక్షలజేయుచునే యుండెను. లోహతత్వజ్ఞులతో నావిషయమును వీలైనప్పుడెల్ల చర్చించుచుండెను. 1899 లో 'మాహన్‌' అను ప్రభుత్వసేనాని యొకడు మనదేశమున లోహపరిశ్రమజేయుట కవకాశములగూర్చి యొక రిపోర్టును ప్రచురించెను. 'ఝరియా' ప్రాంతమున నినుము చేయవచ్చునని, అందుకు