పుట:2015.372412.Taataa-Charitramu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూర్వము, మనదేశమున లోహపరిశ్రమ వృద్ధిలో నుండెను. ఇచటి యినుప ఆయుధములు దేశాంతరములందును ప్రసిద్ధిజెందెను. చిరకాలమునుండియు మనదేశమున నేటికిని చెక్కు చెదరకయున్న 'కుతుబ్ మినారు'ను బోలుకట్టడము లద్భుతములు; అవి మన పూర్వికుల లోహశిల్పముకు నిదర్శనములు. కొన్ని ఖడ్గములుమున్నగు వివిధశస్త్రములు విదేశములకు చాల యెగుమతి యగుచుండెను.

ఆపరిశ్రమ 18 వ శతాబ్దివరకు జరుగుచుండి, అంతట నితరపరిశ్రమలవలె క్షీణించినది. పాశ్చాత్యు లీరెండు శతాబ్దులలో తమవిజ్ఞానము వృద్ధిజేసుకొని, గనులనుండి భస్మముతీసి శుద్ధిజేసి, లోహపరిశ్రమలో నవీనపద్ధతుల గనిపెట్టి, వివిధయంత్రములను పనిముట్లను యంత్రసహాయమున చౌకగ చేయదొడగిరి. వాని దిగుమతిచే, పోటీవలన, మనలోహపరిశ్రమ క్రమముగ మూల కొదిగెను. రైళ్ళువచ్చిన మీదట విదేశపు లోహవస్తువులు మన దేశమున మూలమూలలకు గూడ వ్యాపించెను. అంతట మన లోహపరిశ్రమ లడుగంటెను. ఇక పురాతన పద్ధతులతో నీదాడి నెదుర్కొనుట సాధ్యముకాదు.

కర్రబొగ్గుతో కొలుములద్వారా ఇనుపపొడిని కరగించు పూర్వపద్ధతి లాభకరముకాదు. పాశ్వాత్యదేశము లందువలె వైజ్ఞానిక పద్ధతినే గనులనుండితీయు యినుపపొడిని నేలబొగ్గు నిప్పుతో బాగుగ కాచి, కరగించి, సున్నముతో శుద్ధిచేసి, పోతపోసి,