పుట:2015.372412.Taataa-Charitramu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సహ్యాద్రిలో జలపాతముగల్గించి, దానితో విద్యుచ్ఛక్తి జనింప జేసి, దాని నీయంత్రాదుల కుపయోగింపదలచెను.

ఈరెండు మహాపరిశ్రమలను ఆయన తలపెట్టినను, 1904 లోనే యామహనీయుడు మరణించుటచే, తానేవానిని స్థాపించి జరుపుటకు వీలుకలుగలేదు. ఆయన కోరికప్రకారము వాని నాయనపుత్రులు పూర్తిచేసి నిర్వహించిరి. *[1]

ఆధునిక నాగరికత అయోమయము అయ:పరిశ్రమతోనే గొప్ప మరఫిరంగులను, గుండ్లను, శస్త్రములను, గొప్ప యుద్ధనౌకలను తయారుచేసి, పాశ్చాత్యజాతులు, జపానీయులు, బలీయులైరి. ఇంజనులు, రైలుపట్టాలు, కత్తులు, మేకులు, మరలు మున్నగు పనిముట్లును ఇనుపవే. ఇనుపవస్తువుల వాడుక యింకను హెచ్చుచున్నది. ఇటీవల గొప్ప భవనములు, వంతెనలు, భద్రమగు పెట్టెలు, పనిముట్లు, మున్నగువానికిని క్రమముగా కర్రకు బదులు యినుమునే వాడుచున్నారు.

  1. * జంషెడ్జితాతా కధలో, ఈరెంటి వివరణ మవసరము కాదని కొందరికి తోచవచ్చును. కాని ఈరెండుపరిశ్రమలు మనదేశము కత్యావశ్యకములని, వానిని స్థాపించి లాభకరముగ సాగింపవచ్చునని, జంషెడ్జితాతాయే కనిపెట్టెను; దృఢవిశ్వాసముతో, వానిని సాధించుటకై, అనేక సంవత్సరములు పరిశోధనలజేసి, విశేష వ్యయముతో అనేక ప్రాంతముల బరీక్షించి, దూరదృష్టితో సాధనకలాపముల సిద్ధముజేసి, మార్గదర్శకు డయ్యెను. తనకుమాళ్ళకును, అంతరంగ మిత్రులకును సాధనసామగ్రినంతను నొప్పగించి, వారికి కార్యదీక్ష కల్గించెను; అందువలననే ఆపరిశ్రమలు జయము గాంచగల్గెను. అందుచే జంషెడ్జితాతాయే ఆపరిశ్రమల స్థాపనకు కారకుడని యెంచవలెను.