పుట:2015.372412.Taataa-Charitramu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాసలక్కరలేకుండ, ఇప్పటికి 300 మందికిపైగా భారతీయు లీవిజ్ఞానాలయమందే పొందియున్నారు. వారిలో కొందరనేక పరిశోధనలగూడ చేసియున్నారు. *[1]


_________
  1. * ఈవిజ్ఞానాలయ మేర్పడినంతట, ఇంకొక విజ్ఞానకళాశాలను భారతీయుల యాజమాన్యమందే స్థాపించుటకు కొందరు బంగాళీ లుద్దేశించిరి. దాని ఫలితముగ కలకత్తాలో న్యాయవాది ప్రముఖుడగు శ్రీతారకనాధపాలితు గారు 15 లక్షల రూపాయలను, శ్రీరాసవిహారిఘోషుగా రొకసారి పది లక్షలను మరల మరికొంతసొమ్మును, కొందరంతట కొంతభూవసతిని, కలకత్తాలో విజ్ఞానకళాశాల స్థాపనకై యచ్చటి విశ్వవిద్యాలయమున కిచ్చిరి. ఆకళాశాలలో భారతీయులద్వారానే యున్నతవిజ్ఞానబోధ జరుగవలెనని నియమ మేర్పడెను. సుప్రసిద్ధ రసాయనాచార్యులు అనేకపరిశ్రమల నడిపిన నిపుణులు నయిన శ్రీప్రపుల్ల చంద్రరాయలు దీని నియంతగా నేర్పడిరి. భవనాదులకు విశేషముగ సొమ్ము ఖర్చుకాకుండ, ఆయన మితవ్యయముతో నాకళాశాల నారంభమునుండి జయప్రదముగ నడిపిరి. ఇందు విజ్ఞానపరిశోధనజేసిన యనేక యువకు లన్యదేశములందును ప్రసిద్ధిజెంది, స్వతంత్ర పరిశోధకులు ఆచార్యులునై ఉన్నతోద్యోగముల నలంకరించిరి. వారి యావిష్కారములలో కొన్ని పరిశ్రమలకును సహాయకములైనవి. ఇందు కృతార్థులైన యువకులు రాయిగారు నడిపించు 'బెంగాల్ కెమికల్ అండ్ ఫర్మసిటికల్ వర్క్సు'లో వివిధరసాయన వస్తువులను పాశ్చాత్యౌషధములనుగూడ కలకత్తాలో చౌకగ తయారు చేయుచున్నారు. ఇప్పుడు బెంగుళూరులో నియంతగానున్న చంద్రశేఖర వెంకటరామనుగా రాకళాశాలలోనే సుమారు 15 ఏండ్ల పరిశోధనల జేసి ఖ్యాతిగాంచిరి; అచటి మితవ్యయపద్ధతుల ప్రకారమే, బెంగుళూరి విజ్ఞానాలయమును రామనుగా రిప్పుడునడుపుచున్నారు.