పుట:2015.372412.Taataa-Charitramu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రజా క్షేమముగోరు మైసూరుప్రభుత్వమువారు స్వయముగనే యిట్టిపరిశ్రమలను, పట్టు, ఇనుముమున్నగు వానిని గూడ, స్థాపించి జరుపుచున్నారు. ఆపరిశ్రమ లిప్పుడు వేలకొలదిజనులకు జీవనాధారమైనవి. విజ్ఞానాలయముకు ఇట్లు మైసూరు ప్రభుత్వమువారు దూరదృష్టితో ద్రవ్యసహాయముచేసి, దానిని బెంగుళూరిలోనే స్థాపింపజేయుట, మైసూరు రాజ్యముకు విశేష లాభకరమయ్యెను.

ఇటీవల, ఈవిజ్ఞానాలయపు యూరపియను డైరక్టరిందుండి వెడలిపోగా, దీనిసలహాకమిటీవారి శిఫారసుపైన, 1933 సం. లో ఆచార్య సి. వి. రామనుగారు దీని డైరక్టరుగ నియమింపబడిరి. రామను గారప్పటికి కలకత్తా విశ్వవిద్యాలయపు విజ్ఞాన కళాశాలలో ఫిజిక్సు అనగా భౌతికశాస్త్రశాఖలో ప్రధానాచార్యులుగనుండిరి. ఆయన గొప్ప పరిశోధకుడై, నూతనావిష్కారములు జేసి జగద్విఖ్యాతు డయ్యెను. ఆయన యాజమాన్యమున ఈవిజ్ఞానాలయమున భౌతికశాస్త్రశాఖగూడ చేర్చబడి, కొత్తపరిశోధనలు విశేషముగ చేయబడుచు, నూతనోత్సాహముతో కార్యక్రమము జరుగుచున్నది. ఇప్పుడు నిర్వహణము మితవ్యయముతో సమర్ధరీతిని జేయబడుచున్నది. పాశ్చాత్యదేశములందే యిదివరలో లభించు విజ్ఞానబోధను, అంత వ్యయప్ర