పుట:2015.372412.Taataa-Charitramu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభుత్వమువారొక కమిటీ నేర్పర్చిరి. ఆకమిటీవారు కొన్ని సందేహముల దెల్పిరి; భారతప్రభుత్వమెంత యిచ్చునదియు తేలలేదు; ఇట్లు కాలహరణమగుచుండెను. తాతా యీలోగా జబ్బుపడుచుండెను; ఆయన స్వయముగ లండనువెళ్ళి, అచట రామ్సేగారితోను భారతమంత్రితోను చర్చించి, వారిచే మనప్రభుత్వమున కావిషయమై తొందరకల్గించెను. 1903 లో నటనుండి మనదేశముకు తిరిగివచ్చి, తాతా మరల నిచ్చటి ప్రభుత్వాధికారుల బ్రోత్సహించెను. అంతట మనప్రభుత్వమువారు కొంత స్థిరసహాయము చేయుదుమని ప్రచురించిరి. ఇట్లు వివరముల విమర్శ జరుగుచుండగా, 1904 మే నెలలో జంషెడ్జి కాలధర్మ మొందెను.

కాని యాయన కుమాళ్ళగు దొరాబ్జి రత్నజీతాతాలు పితృవాక్యపాలన జరిగింప నిశ్చయించిరి; 30 లక్షలరూపాయలు అప్పటికిమ్మతుగ తేల్చిన (బొంబాయిలోని) తనమహాభవనములను జంషెడ్జి యీవిజ్ఞానాలయముకై యిచ్చుటకు నిర్ణయించి యుండెను. ఆప్రకార మాధర్మము జరుపుట కాయాస్తులను ప్రభుత్వాధికారులకు దఖలుపర్చుచు, దొరాబ్జి రత్నజీలు 1905 లో దఖలుపత్రము వ్రాయించియిచ్చిరి.

అంతట నియంతకై కొంతయత్నము జరిగి, రాయల్ సొసైటీసభ్యుడు, రామ్సేకు సహకారి, సుప్రసిద్ధ వైజ్ఞానికుడు నగు ట్రావెర్సుపండితు డావిజ్ఞానశాలకు డైరక్టరు (నియంత)గ