పుట:2015.372412.Taataa-Charitramu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లసినంత విశాలమగు ఖాళీస్థలము కలదు. భారతప్రభుత్వము, రామ్సేగారు కూడ, బెంగుళూరునే వరించిరి. *

ఈస్థితిలో వదాన్యుడు ప్రజాక్షేమాభిలాషియునగు మైసూరు మహారాజుగారు (అప్పటి తమదివానగు శేషాద్రి అయ్యరుగారి ప్రోత్సాహమున), బెంగుళూరులో దానినుంచుచో, అచట (300 ఎకరములకు తక్కువలేకుండ) అందుకు వలయు స్థలమంతయు, భవనయంత్రాదులకై 5 లక్షల రూపాయలను, ఇంకను సాలినా యేబదివేల రూప్యములను, ఎట్టిషరతులు లేకుండ నుచితముగ నిచ్చెదమనిరి. మరొక ప్రాంతమున దాని నుంచుచో, ఇట్టివిరాళము దొరకునట్లు కనబడలేదు; (మైసూరు సంస్థానమందు స్థాపింపదలచు వివిధపరిశ్రమల కావిజ్ఞానాలయము సహకారియగునని, తమ సంస్థానవిద్యార్ధులకును లాభకరమని, మైసూరుప్రభుత్వమువారు గ్రహించిరి). అంతట బెంగుళూరిలోనే యావిజ్ఞానాలయము నుంచుట స్థిరమయ్యెను.

కాని యప్పుడైనను పనులు వెంటనే యారంభము కాలేదు; రామ్సేగారి యంచనాఖర్చు నింకను తగ్గించుటకు భారత

  • * బొంబాయియంత పెద్దదికాదు కాని, బెంగుళూరును మూడులక్షల జనసంఖ్య గలిగి, ఇంకను వృద్ధియగుచున్నది. ఇందుకొంత (కంటొన్మంటు) బ్రిటిషుపాలనమందు, మిగిలినది మైసూరుప్రభుత్వపు పాలనలోను, ఉన్నది. ఇది యూరపియనులకు భారతీయులకు గూడ ఆరోగ్యప్రదము. 'రాయల్ సొసైటీ' ప్రపంచపు విఖ్యాతవైజ్ఞానిక సంఘములలో నొకటి; దీని కార్యస్థానము లండనులో నుండును.