పుట:2015.372412.Taataa-Charitramu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విద్యాలయము లేర్పడినను, అందున్నత విజ్ఞానబోధకు పరిశోధనలకు అవకాశములు లేవు. అందుకై విదేశములకే పోవలెను. అంతటి ఉత్సాహ సాహసములుగల ధీమంతులగు యువకులు నిర్ధనులగుటచేతను, మన శ్రీమంతుల కావిషయమున శ్రద్ధలేకయు, మన విద్యార్ధులకు విజ్ఞానము దుర్లభమయ్యెను. మరియు కలెక్ట రీమున్నగు ఉన్నతోద్యోగపరీక్షలందును ఉన్నత విజ్ఞానవంతులే సులభముగ కృతార్థులు కాగలరు; అప్పుడు ఐ. పి. ఎస్. పరీక్షలు లండనులోనే జరుగుచుండెను. *[1] ఆ పరీక్షలో ద్రవ్యహీనులగు భారతీయులు పాల్గొనుటకు అవకాశ ముండుటలేదు; చాలవరకు బ్రిటిషువారే ఆపెద్ద యుద్యోగము లొందుచుండిరి; ఆస్థితిలో మనదేశీయులకు తగు నవకాశము కల్గించుట యవసరమని తాతాకు తోచెను.

ఐ. సి. ఎస్. మున్నగు పెద్దఉద్యోగ పరీక్షలకు విజ్ఞానాభ్యాసముకు ఇంజనీరింగు (వాస్తువిద్య) మున్నగువానికి పోదలచు బీదయువకులకు తోడ్పడుటకై, తాతా గారిట్లు 1892 లో కొన్నిలక్షల రూపాయలతో నొకనిధి నేర్పర్చిరి. ప్రతిసంవత్సరమును ప్రతిభావంతులగు ఇద్దరు మనదేశపు యువకులకు, విదేశములందున్నతవిద్య నభ్యసించుటకు, సాలీనా యీఫండులో నుండి యవసరమునుబట్టి కొన్ని వేలరూపాయల ద్రవ్యసహాయ

  1. * ఇప్పుడు ఆపరీక్ష యేకకాలమందే లండనులోను మనదేశమున ఢిల్లీలోనుగూడ జరుపబడుచున్నది.