పుట:2015.372412.Taataa-Charitramu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11. విజ్ఞానవర్ధనము.

జంషెడ్జితాతా పారిశ్రామిక నాయకుడు; ఆమహనీయుడు తనజీవితమంతను ఈదేశపు వ్యాపారవృద్ధికి ఆర్థికోన్నతికినే ధారవోసెను; అందఖండప్రజ్ఞతో జయమొందెను. మనదేశపు ఇతరపారిశ్రామికులకు సాధారణముగా విజ్ఞానాభిలాష లేదు. కాని తాతామాత్రము మొదటినుండియు విజ్ఞానమం దమితేచ్ఛ గల్గియుండెను. కళాశాలలో విద్యార్థి దశలోనే, ఆయనకుశాగ్రబుద్ధి విజ్ఞానాభిరుచి విశదమగుచుండెను.

భారతదేశ ముచ్చస్థితిలో నుండినప్పు డీదేశీయులు విజ్ఞానమందును ప్రజ్ఞావంతులై యుండిరి. అప్పుడు చాల వెనుకబడి యుండియు, ఇటీవల నీదేశముకన్న ఇంగ్లండు, జర్మనీ, అమెరికా, జపానులు చాల బలీయములైనవి; అందు కాదేశములం దిటీవలజరిగిన యద్భుత విజ్ఞానాభివృద్ధియే మూలకారణమనియు, విజ్ఞానమున వృద్ధిగాంచినగాని యీదేశము మరల ఉన్నతము కాజాలదనియు, తాతా గ్రహించెను. ఆర్థిక వ్యాపారాదులకే గాక, రాజకీయముకు, తుదకు నిజమగు ఆధ్యాత్మికాభివృద్ధికి గూడ, విజ్ఞాన మావశ్యకము; (ప్రకృతిలో లీనమగు భౌతికశక్తిని వశపర్చుకొనుటకును, అమేయమగు సృష్టిరహస్యమును చిద్విలాసతత్వమును గ్రహించుటకును, విజ్ఞానమే ముఖ్యసాధనము.) తాతా తనమిల్లుల స్థాపించునాటికి మనదేశమున కొత్తగ విశ్వ