పుట:2015.370800.Shatakasanputamu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     వము లోకంబులలో నలంఘ్యమగుట న్వర్ణింపఁగా నీ మహ
     త్త్వముకంటెం గడుఁ జెల్లు భక్తుల మహత్త్వంబెన్న సర్వేశ్వరా!110
మ. శివసాహిత్యుల సత్కరస్థలము కాశీక్షేత్రమా హస్తదే
     శవిశాలోన్నతశాఖ లారయఁగఁ బంచక్రోశమా పాణిసం
     భవశోభాన్వితచిత్రరేఖలు మహాభాగీరథీతీర్థముల్
     శివలింగం బల విశ్వనాథుఁ డరయన్ సిద్ధంబు సర్వేశ్వరా!111
మ. వరుసం బైకొనివచ్చు కర్మములు మున్వారించి మాయామల
     జ్వరము ల్గూల్చి యపారఘోరతరసంసారాబ్ధి లంఘించి భీ
     కరసూక్ష్మాంగవిచిత్రకంచుకము వీఁకం బుచ్చి పోవైచి తాఁ
     బరమవ్యోమము సొచ్చు నీ యచలసద్భక్తుండు సర్వేశ్వరా!112
మ. పరమార్థంబగు తత్త్వమార్గమున నీ పాదాబబ్జసద్భక్తుఁ డొ
     క్కరుఁడుం దక్క సరోజజాద్యమరసంఘాతంబులోనెల్లఁ దా
     నెరయం గాచికొనంగఁ జాలరు మహానిర్భీతుఁడున్ లేఁ డతి
     స్ఫురణం గాలుఁడు దన్ను వేచి వడిఁ గొంపోనుండ సర్వేశ్వరా!113
మ. తన చారిత్రము తత్త్వవేత్త లగుభక్తశ్రేణి వర్ణింపఁగాఁ