పుట:2015.370800.Shatakasanputamu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     తకళాత్ముండవు రౌద్రమూర్తి వతిసౌందర్యాంబికాసంగమా
     ధికలోలుండవు దివ్యయోగివి మదిం దెల్లంబుగా నెట్టివా
     రికిఁ దా శక్యమే నీ నిజం బరసి వర్ణింపంగ సర్వేశ్వరా!106
మ. భవదుఃఖార్ణవయానపాత్రము పరబ్రహ్మంబు యోగీంద్రహృ
     ద్భవనప్రస్ఫురితప్రదీపము నఘధ్వాంతార్కబింబం బతి
     శ్రవణానందకరంబు సన్మునిగణస్వాధ్యాయపాఠంబు మీ
     శివనామాంకము భక్తపుంగవ సదా సేవ్యంబు సర్వేశ్వరా!107
మ. అణిమాద్యష్టగుణప్రసిద్ధులు త్రిలోకారాధ్యు లుద్యద్వచో
     మణికోటిప్రతిమప్రభాపటలు లున్మాదేంద్రియధ్వాంతభీ
     షణదైత్యేంద్రవినాశకారణమహాశౌర్యోన్నతు ల్లోకర
     క్షణదక్తుల్ వినుతింప నీ ప్రమథసంఘాతంబు సర్వేశ్వరా!108
మ. సకలాధీశ్వరులై గణాధిపతులై సర్వజ్ఞులై నిత్యులై
     యకలంకాత్మకులై మహామహిములై యంభోజగర్భాండర
     క్షకులై యుండుదు రెల్లవారును భవత్సద్భక్తి నానాగణా
     ధికలీలావిధి నంతరంగముల వర్తింపంగ సర్వేశ్వరా!109
మ. అమరేంద్రాబ్జభవాచ్యుతాదులకు నీ యాజ్ఞాప్రభావం బలం
     ఘ్యము నీకున్ భవదీయభక్తమహదాజ్ఞాపంబు నుద్యత్ప్రభా