పుట:2015.370800.Shatakasanputamu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     భీలజ్వాలలఁ గ్రాఁగు మానవునకున్ బింబాధరల్ హారవ
     స్త్రాలంకారము లించుకించుక సుఖంబై తోఁచు సర్వేశ్వరా!102
శా. ఆకాశానలచంద్రసూర్యపవమానాత్మాంబువిశ్వంభరా
     ప్రాకామ్యాంచితమూర్తి భేదముల నీ బ్రహ్మాండనానాఘటా
     నీకప్రాకట జీవభావవిలసన్నిర్మాణకర్మాద్భుతా
     స్తోకశ్రీకరమూర్తియై వెలుఁగు నీ స్థూలంబు సర్వేశ్వరా!103
మ. అతివాఙ్మానసమై యజాండనిలయంబై యాదిమధ్యాంతవ
     ర్జితమై నిర్గుణనిష్కలంకపదమై సిద్ధాంతమధ్యాత్మసం
     యుతమై కోటిరవిప్రకాశయుతమై యోంకారమంత్రాదిసం
     స్తుతమై యెంచ నచింత్యమై వెలుఁగు నీ సూక్ష్మంబు సర్వేశ్వరా!104
మ. అజుఁడై సృష్టి యొనర్చు రాజసముచే నందంబుగాఁ దా నధో
     క్షజుఁడై వర్ధిలఁజేయు సాత్త్వికము సంప్రవ్యక్తిగా గోపతి
     ధ్వజుఁడై సంహృతిసేయుఁ దామసమునం దత్సర్వముం గూడఁగా
     నిజవిస్ఫూర్తి వెలుంగుఁ దుర్యమగుచున్ నీ యాజ్ఞ సర్వేశ్వరా!105
మ. సకలాధీశ్వరపట్టభద్రుఁడవు భిక్షాగామి వత్యంతశాం