పుట:2015.370800.Shatakasanputamu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శా. శ్రీకంఠాయ నమోనమో నతసురజ్యేష్ఠాయ రుద్రాయ లిం
     గాకారాయ నమోనమో విగతసంసారాయ శాంతాయ చం
     ద్రాకల్పాయ నమోనమో దురితసంహారాయ తే యంచు ని
     న్నాకాంక్షం బ్రణుతించు మానవుఁడు నీవై యుండు సర్వేశ్వరా!99
మ. భువనోత్పత్తి విధించుచో భవుఁడవై పొల్పొందఁగా దాని ను
     త్సవలీలం బ్రభవించుచో మృడుఁడవై సర్వంబుఁ గల్పాంతభై
     రవసంక్షోభ నటించుచో హరుఁడవై త్రైగుణ్యశక్తిం దుదిన్
     శివనామాంకముఁ దాల్చు నీ మహిమ దాఁ జిత్రంబు సర్వేశ్వరా!100
మ. కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కూలంబునం గూలినం
     జలజాతప్రియశీతభానులు యథాసంచారము ల్దప్పినం
     జలధు ల్మేరల నాక్రమించి సముదంచద్భంగి నుప్పొంగినన్
     దలఁకం డుబ్బఁడు చొప్పుఁ దప్పఁడు భవద్భక్తుండు సర్వేశ్వరా!101
శా. శూలస్థాపితుఁడైన మానవునకున్ శూలంబు దుర్వారవా
     త్యాలిం గంపము నొందకుండుట సుఖంబై తోఁచు మాడ్కిన్ భవా