పుట:2015.370800.Shatakasanputamu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. సమదోత్సాహసుఖాభిలాషలును నీ సంసారమాయావినో
     దములు న్స్వర్గఫలాపవర్గఫలచిత్తభ్రాంతులుం బూజ్యరా
     జ్యమహాకాంక్షలు నెన్ని చూడ నివి నీ సద్భక్తి కత్యంతరా
     యములై మాటికిమాటి కడ్డుపడుఁ గార్యశ్రేణి సర్వేశ్వరా!72
శా. మోహధ్వాంతములో మునింగిన మహామూఢుం డతిభ్రష్టుఁడై
     సోహంబంచుఁ దొడంగి నీకుఁ గడు దూరాత్ముం డగుంగాని దు
     ష్టాహంకారగుణంబు మాని మది సొంపారంగ సద్భక్తి దా
     సోహంబన్న భవత్పదార్చకుఁడు నీవై యుండు సర్వేశ్వరా!73
శా. చావంబుట్టుచుఁ బుట్టఁజచ్చుచు మహాచండాలసంసారపా
     రావారంబునఁ గూలి తాఁ జెడుటకుం బ్రవ్యక్తిగా నాత్మలో
     నేవం బొందక యేను నీవనుట తా నేజ్ఞానమో శ్రీమహా
     దేవా యిట్టి కుతర్కముం గలదే చింతింపంగ సర్వేశ్వరా!74
మ. రసికుండై భవదంఘ్రిపద్మయుగ మారాధించుచో దుర్మద
     వ్యసనాటోపము చిక్కులం బొరలుచు న్వర్తించుచున్నట్టి పా
     లసు పూజావిభవం బదొప్పునె భువిన్ లక్షింప నారంభముం