పుట:2015.370800.Shatakasanputamu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     యంగాభ్యర్చన జంగమాహితకరుండై చేసినం దా శవ
     శృంగారంబగు వాని భక్తి మదిఁ జర్చింపంగ సర్వేశ్వరా!64
మ. ధరణిం గర్మవిధానభక్తి విభవద్ధ్యానోత్తమజ్ఞానముల్
     వరుసం బేర్కొన నాల్గుయోగములు తత్త్వం బెందు నీభక్తి వి
     స్తరబాహ్యక్రియ లెల్లఁ బొల్లు లగుటం దద్భక్తియోగంబు తాఁ
     బరగం దక్కినమూఁడుయోగములకుం బ్రాణంబు సర్వేశ్వరా.65
మ. అమరంగా ధనమిచ్చి కాతురు మహీయఃఃప్రీతిఁ బ్రాణంబుఁ బ్రా
     ణము నర్థంబును నిచ్చి కాతు రభిమానంబు న్విశేషించి మా
     నము బ్రాణంబు ధనంబునిచ్చి కడుసన్మానంబుగా నుత్తమో
     త్తమచారిత్రులు భక్తిఁ గాతురు ప్రమోదంబంది సర్వేశ్వరా!66
మ. అనుబద్ధేంద్రియభూతవర్గము యమాద్యష్టాంగమంత్రోరుసా
     ధన నుచ్చాటన సేసి పాపి గురుసద్వాక్యప్రకాశోత్తమాం
     జనదృష్టిం బరికించి యేర్పఱిచి వాంఛం గోరి సాధించి చే
     కొను చిన్మూర్తికి గాని భక్తివిధి గీల్కోదెందు సర్వేశ్వరా!67