పుట:2015.370800.Shatakasanputamu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     త్కటదుష్టేంద్రియవర్గతామసపరిగ్రస్తంబు గాదెట్లు చీ
     కటికిం దిగ్మమరీచికిం గలదె సాంగత్యంబు సర్వేశ్వరా!60
మ. బలవంతుండును దుర్బలుండును మహాప్రౌఢుండు మూఢుండునుం
     గులజుండుం గులహీనజాతుఁడు ఘనక్రూరుండు శాంతాతిని
     శ్చలచిత్తుండును నొక్కరూప మది నీ సద్భక్తి చిత్తంబులో
     పల వర్ధిల్లిన మీఁద నేవిధమునన్ భావింప సర్వేశ్వరా!61
శా. కామోద్రేకవిజృంభణంబును సమగ్రక్రోధమున్ లోభమున్
     వ్యామోహంబు మదంబు మచ్చరము దీవ్రంబైన పంచేంద్రియో
     ద్దామాటోపము గ్రాఁచి పెంపెసఁగు తత్త్వజ్ఞానికిం గాక తా
     సామాన్యాత్ముల కేల నూలుకొను నీ సద్భక్తి సర్వేశ్వరా!62
మ. ఉరుపక్షంబులు వచ్చునంతకు నిరుద్యోగంబున న్వృక్షకో
     టరమధ్యంబుననుండు పక్షిగతి నిష్ఠం గోరి నీ భక్తి వి
     స్తర మాత్మం బ్రభవించు నంతకును నీ సంసారకారాగృహాం
     తరగేహంబున నుండి జీవుఁ డతివంతన్ బొందు సర్వేశ్వరా!63
శా. లింగారాధన జంగమార్చనము లోలిన్ భక్తి కంగంబు ప్రా
     ణాంగవ్యాప్తియునై స్ఫురించు నిది తత్త్వార్థంబగుం గాన నా