పుట:2015.370800.Shatakasanputamu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     నవికల్పస్థితి నంత భక్తుఁడును నీవై యుండు సర్వేశ్వరా!52
మ. సుముఖుండై శివయోగి మోదము మదిన్ శోభిల్లఁ జేకొన్న భి
     క్షము విప్రోత్తమకోటిభోజనసదృక్షంబన్న సౌభాగ్యయో
     గమునం దారయ నమ్మహామహుఁడు వేడ్కం గోరి యారోగిణం
     బమరం జేసిన పుణ్యమెట్లు గుఱిసేయ న్వచ్చు సర్వేశ్వరా!53
శా. ఎచ్చో నీ పదభక్తుఁ డుండు మది నింపెక్కం బ్రయత్నంబుతో
     నచ్చో నీ వనిశంబు నుండుదు త్వదీయధ్యానచిన్మూర్తులై
     యచ్చో సన్మునులెల్ల నుండుదురు మంత్రాంగాక్షరాయుక్తులై
     యచ్చోఁ దీర్థములెల్ల నుండు నిది వేదార్థంబు సర్వేశ్వరా!54
శా. సత్యం బెప్పుడుఁ దప్పఁడేనియు దురాచారుండు గాఁడేని యౌ
     చిత్యం బేమఱఁడేని దుర్జనుల గోష్ఠిం బొందఁడే భక్తసాం
     గత్యం బాదటఁ బాయఁడేని మదనగ్రస్తుండు గాఁడేని నీ
     భృత్యుం డాతఁడు మూఁడులోకములలోఁ బెంపొందు సర్వేశ్వరా!55
శా. పెంపన్ దల్లి యగున్ రుజాపటలదుష్పీడావిధి క్షోభ వా
     రింపన్ వైద్యుఁ డగుం గుమార్గవిధులం గ్రీడింపఁబోకుండ శి