పుట:2015.370800.Shatakasanputamu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. వెలి వీక్షించిన నీ స్వరూపమె మహావిస్పష్టమై యాత్మలో
     పల భావించిన నీ స్వరూపమె మహాప్రవ్యక్తమై దృష్టులం
     దలఁపం జేకొని యున్న నీ యచలితధ్యానంబునం జేసి తాఁ
     గలనైన న్శివయోగి తన్ను జగముం గానండు సర్వేశ్వరా!49
మ. భవదాకారమె కాంచు నీ స్తవకదంబశ్రేష్ఠసద్వాక్యముల్
     చెవులార న్విను నిన్నె చెప్పు మది దుశ్శీలేంద్రియాటోపదు
     ర్వ్యవసాయాత్ములఁ గాంచుచో వినెడిచో వర్ణించుచోఁ జీఁకునుం
     జెవిటి న్మూగయునై చరించు మహి నీ శీలుండు సర్వేశ్వరా!50
మ. అతిలాలిత్యముగా నహర్నిశము నిన్నర్చింపగా వచ్చు సు
     వ్రతుఁడై యుండఁగవచ్చు నెల్లకళలం బ్రౌఢుఁడు గావచ్చు వా
     క్పతి గానైనను వచ్చుఁ గాని మఱి నీ భక్తుండు గారాదు సు
     స్థితిగా నీ దయ లేని మానవునకుం జింతింప సర్వేశ్వరా!51
మ. భవికిన్ భక్తి మహత్త్వ మంకురితమై పాటిల్ల భక్తుండు బాం
     ధవమాత్రుండగు భక్తి పుష్పితముగాఁ దద్భక్తుఁ డాత్మేశుఁడై
     సవిశేషస్థితిఁ దోఁచు భక్తి సఫలోత్సాహంబునుం బొందఁగా