పుట:2015.370800.Shatakasanputamu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     కల రూపారయలేక చిక్కులఁ బడంగా నిన్ను హస్తార్పితా
     మలకవ్యాప్తికిఁ దెచ్చి యేర్పఱచి సంబంధించి చేకొన్న భ
     క్తుల శౌర్యం బుపమింప నెవ్వఁడు సమర్థుం డింక సర్వేశ్వరా!30
మ. అమరన్ భక్తగణాత్మమధ్యమము లింగావాస మీ లింగ మ
     ధ్యమముం బద్మభవాండభాండనిలయంబై యుండుట భక్తతృ
     ప్తిమహాలింగము తృప్తియై మహిమ నుద్దీపించుఁ దల్లింగతృ
     ప్తిమహత్త్వంబున నీ సమస్తమును దృప్తిం బొందు సర్వేశ్వరా!31
మ. అనురాగంబున నిన్నుఁ జూచుఁ దలపోయన్ జొక్కుఁ గాంక్షించు వ
     ర్ణన సేయం దమకించు సిగ్గు విరియన్ బ్రార్థించు శోషించు నం
     త నెదన్ ధ్యానము దాల్చుఁ దన్ను మఱచుం దానీ దశావస్థలం
     దనరంగా మది నిన్ను డక్కఁ గొను సద్భక్తుండు సర్వేశ్వరా!32
మ. ఎలమిన్ భక్తుఁడు వక్రుఁడై నడిచెనే నేపారఁగా దానికిం
     గలుషింపం గలహింపఁ గింకిరిపడం గాదెట్టిచోనైన ని
     ర్మలగంగాపృథులప్రవాహ మరయం బ్రస్ఫూర్తిఁ దానెన్ని వం
     కలుగాఁ బాఱిన దాని నొండు వలుకంగాఁ జన్నె సర్వేశ్వరా!33