పుట:2015.370800.Shatakasanputamu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     బరగం జేయుటకంటె సువ్రతములొప్ప వేదశాస్త్రార్థత
     త్పరుఁడై యాదటఁ జల్పుకంటె మది నుత్సాహించి నీ భక్తిమ
     త్పురుషశ్రేష్ఠులఁ బూజసేయుట మహాపుణ్యంబు సర్వేశ్వరా!26
మ. భవదీయామలతత్త్వనిర్ణయకళాప్రఖ్యాతసద్భక్తపుం
     గవగోష్ఠీసుఖవార్ధిలోనఁ గడువేడ్కం దేలినం గాక యీ
     భువిలోఁ దీర్థజలంబులం గడగినం బోనేర్చునే ఘోరదు
     ర్భవసంఘాకలితాత్మతామసమహాపంకంబు సర్వేశ్వరా!27
మ. ధరణిం బ్రాక్తనభక్తనిర్మితమహాస్థానంబులై యొప్పు శ్రీ
     గిరిముఖ్యంబగు దివ్యతీర్థములు భక్తిం జూచిరే వారి దు
     స్తరదోషంబులు వాయునన్న మఱి సాక్షాద్భక్తులం జూచినం
     బరమార్థంబుగఁ బాయదే నరుల పాపంబెల్ల సర్వేశ్వరా!28
మ. కని సద్భక్తుల కంత నంతఁ గడువేడ్కన్ హృత్ప్రణామంబు సే
     సినమాత్రం జెడు సర్వదోషములు తచ్ఛ్రీపాదము ల్ముట్టి మ్రొ
     క్కిన సర్వాంగసమగ్రశుద్ధియగు భక్తిన్ వారికిం బ్రీతిచే
     సినఁ ద్వద్దివ్యదయావలోకనఘనశ్రీ లొందు సర్వేశ్వరా!29
మ. జలజాతప్రభవాచ్యుతాదులు మదిం జర్చించి చర్చించి నీ