పుట:2015.370800.Shatakasanputamu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     ర్మలహస్తార్పితభూతిఁ బ్రీతి నొసలారం బూయు విశ్వాసికిన్
     ఫలమూహించి విధించి యెవ్వరికిఁ జెప్పన్వచ్చు సర్వేశ్వరా!22
మ. పలుతీర్థంబులఁ గ్రుంకుకంటె మహిలో భక్తాంఘ్రిపానీయముల్
     తలమీఁదం జిలికించుకొన్న శుచితీర్థం బాడ భారంబు త
     త్ఫల మత్యల్పము భక్తపాదయుగళాంభఃస్పర్శ నిర్భారమై
     యలరున్ శాశ్వతభుక్తిముక్తిఫలదంబై యుండు సర్వేశ్వరా!23
మ. రమణన్ భక్తసమగ్రదర్శనము తీర్థశ్రేణి తద్గోష్ఠి తీ
     ర్థము తద్దివ్యదయావలోకనము తీర్థంబెన్నఁగా నిట్టి జం
     గమతీర్థాంబుధి నోలలాడక వివేకభ్రష్టులై పోయి లో
     కములోఁ దీర్థములంచు నేఱులు సొజంగానేల సర్వేశ్వరా!24
మ. కమనీయంబగు సర్వతీర్థములు లింగంబున్నచో మూర్తిమం
     తములై యొప్పుచునుండు లింగమును దాత్పర్యంబుతో భక్తగా
     త్రములం దెప్పుడు నుండుఁ గాన మహిలోఁ దత్త్వార్థ మూహింపఁ దీ
     ర్థములందెల్లను దివ్యతీర్థము భవద్భక్తుండు సర్వేశ్వరా!25
మ. ధరణిం దీర్థములాడుకంటె నతిమోదం బొప్ప యజ్ఞంబులం