పుట:2015.370800.Shatakasanputamu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     నిగుడం బొంగి నటింతు తాండవమహానృత్యంబు సర్వేశ్వరా!18
మ. అమరేంద్రాబ్జభవాళి కెన్నఁ దుది నీ వాదిం బ్రసాదింప న
     ర్థము సిద్ధించుచునుండుఁగాని సురమాత్రుం గోరిన న్వీరి కా
     ర్యము సిద్ధింప దనేకమార్గములఁ బ్రారంభించిరే నిశ్చయా
     ర్థముగా నీవ సమస్తకర్త వగుటం దర్కింప సర్వేశ్వరా!19
మ. అమరంగా స్ఫుటభక్తినాటకము భాషాంగక్రియాంగాభిర
     మ్యముగాఁ జూపిన మెచ్చి మీరిల బలే యన్నంతకున్ యోనిగే
     హములన్ రూపులు వన్నుకొంచును నటుండై వచ్చి సంసారరం
     గములోనం బహురూపమాడు వెలయంగా జీవి సర్వేశ్వరా!20
శా. శ్రీవత్సాంకు రమావిశేషతయు వాక్ఛ్రీనాథు చాతుర్యమున్
     దేవాధీశ్వరు వైభవోన్నతియు నా తిగ్మాంశు తేజంబు శ్రీ
     దేవీనందను రూపవిభ్రమము చింతింపంగ నీ భక్తిస
     ద్భావాత్ముండగు పుణ్యమూర్తికి దృణప్రాయంబు సర్వేశ్వరా!21
మ. ఇల సద్భక్తుల పాదధూళిపటలం బేమర్త్యుఫాలంబునం
     జిలుకు న్వాఁ డపవర్గనాథుఁ డనినన్ సిద్ధంబుగా వారి ని