పుట:2015.370800.Shatakasanputamu.pdf/67

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. అమితాంభోజభవాండభాండనిలయంబైయుండు నీ యంతరం
     గము పట్టెంతయొ దానికింక బహిరంగం బెట్టిదో సూక్ష్మత
     త్త్వము దానంతకుమీఁద నేమివిధమో తానిట్టి నీ పెంపుమా
     ర్గము నీకైన నచింత్య మెట్లొరుఁ డెఱుంగం జాలు సర్వేశ్వరా!4
మ. ఇన విఘ్నేశ్వర మాతృకాద్రుహిణ బ్రాహ్మీ స్కంద దుర్గా రమా
     వనితాధీశ్వర భైరవుల్ బలిసి భాస్వద్భక్తిసంయుక్తి నీ
     కనిశంబుం బరివారభృత్యనికరంబైరన్న నిన్నింకం గొ
     ల్వనివారెవ్వ రజాండభాండములలో వర్ణింప సర్వేశ్వరా!5
శా. ఏపారంగ నజాండభాండనికరం బేరూపులో బుట్టి యు
     ద్దీపించు న్మఱి రూపులెల్ల సమసుప్తిం బొంది యేరూపులో
     లోపించుం గలయంగ నంతటికిఁ దా లోనై విజృంభించి యే
     రూపం బవ్యయమై వెలుంగు నది నీ రూపంబు సర్వేశ్వరా!6
మ. జలజాతప్రభవాండబుద్బుదము లశ్రాంతంబునుం బుట్టుచుం
     గలయం గ్రాఁగుచునుండు నీ పృథులలింగస్ఫారగర్భాబ్ధిలో