పుట:2015.370800.Shatakasanputamu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐక్యస్థలము

సీ. ధర 'నవశ్య మనుభోక్తవ్యం కృతం కర్మ
                     యనుకర్మయోగంబు నపహసించి
     యేదియు లేక 'జ్ఞానాదేవ మోక్ష' మను
                     జ్ఞానయోగంబు హాస్యంబుచేసి
     వదలక 'యాత్మనా మిద మగ్రజే' త్తను
                     ధ్యానయోగంబును నాశ్రయించి
     [1]తగవెంచఁ 'బూజ్యా యథామవాయం' బను
                     భక్తి యోగంబుచే బాగుగాను
ఆ. జేవ పొదలు పరమశివయోగసుఖసుధా
     శరధి మరచి తన్ను జగము మఱచి
     లింగగతి చరించు లింగలింగైక్యులఁ
     జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు.30
సీ. కరువున బోసినకరణి సమస్తాంగ
                     ములు నిండి నీలోన మూర్తి గొనఁగ
     గండరించిన భాతిఁ గలయు ప్రాణంబున
                     నెలకొని నీరూపు నిగ్గుదేఱ
     నచ్చు నొత్తినయట్టు లంతరంగంబున
                     నెలకొని శృంగార మెలమి మిగులఁ

  1. తగ 'సచ పూజ్యో యథావ్యూహం' బనుభక్తియోగంబు ముక్తికిఁ జేగఁగాక, తివిరి