పుట:2015.370800.Shatakasanputamu.pdf/549

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

598

గౌరవమునుగాని పొందలేనికాలమునం దీదృశకృషి సల్పినందుకు పార్వతీశముగారినిఁ గొనియాడఁదగును. పార్వతీశముగారిశైలి ధారాళముగా నున్నది. వీరు శబ్దాలంకారప్రియులు, యమకమును దఱచుగ వాడుదురు. పద్య మెట్లు రచించినఁ జదువుట కింపుగా నుండునో వీరికి దెలియును. వీరిరచనయందు దఱచు గానట్టుండదు. [1]పార్వతీశముగారి కుమారులు వేంకటనారాయణగారును, హనుమయ్యగారును, నాకుఁ దాళపత్రగ్రంథము లొసఁగినప్పు డీశతకము నచ్చు వేయించెదరాయని యడిగిరి గాని వేయించెదనని చెప్పఁజూలకపోయితిని. తాళపత్రగ్రంథము లిచ్చువారంద ఱట్ల యడుగుదురు. అచ్చు వేయింతుమని యెవరికని చెప్పఁగలము? ఔదార్యముతో నచ్చొత్తించిన శ్రీయుతులు శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రులుగారికిని, నీవిషయమున శ్రమపడిన శ్రీ మజుందారు రామారావుపంతులుగారికిని పార్వతీశముగారి కుటుంబపక్షమునఁ గృతజ్ఞతను దెల్పుచున్నాను.

52. ఆఫీసు వేంకటాచలమొదలివీథి,

అక్కినేని

తిరువల్లిక్కేణి, చెన్నపురి.

ఉమాకాంతం

18-9-13.

  1. ఈకవి యేబదిసంవత్సరముల క్రింద నీశతకము రచించియండును.