పుట:2015.370800.Shatakasanputamu.pdf/548

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

597


భక్తామంగళ శైలభేదన మహాదంభోళిధారావహం
శ్రీగుచ్ఛాద్రిపురాధివాస మనిశం శ్రీరామలింగంభజే.

8


శ్లో.

శ్రీమత్పల్లికులార్ణవేందువిలసచ్ఛ్రీనారసింహన్యస
తుత్రేణేహతుపార్వతీశకవినాప్రోక్తం శివస్యాష్టకం,
శ్రీగుచ్ఛాద్రినివాసినోభపహరం శ్రీరామలింగస్యవై
యేభత్తాస్సతతం పఠంతి మనుజాస్తేయాంతి మోక్షంధ్రువం.

9

వీరి నీరచన కెయ్యది పురికొల్పెనో యది విచార్యము. ఘనభావములు గాని, భక్తవరులహృదయసీమలయందుఁ బ్రతిఫలించు దివ్యతేజస్సుయొక్క ఛాయ గాని, కవితాజ్వలనముయొక్క వేడిమిగాని, దృశ్యప్రపంచయవనికాంతర్గతలీలాదర్శనవిలాసంబు గాని శతకంబున వెదకవలసి యున్నది. ఆనందాశ్రువు లట్టహాసములు, చాంచల్యము, సంస్తంభనము, పార్వతీశముగారి కవస్థాభేదము కలిగించినట్లు తోఁపదు. పురాణగాథల నుల్లేఖించువిశేషణములు, సంబోధనములు మొదలగువానితోఁ బద్యములను వీరు నింపి "విరచించుశక్తి పుట్టని పురుషునిచదువులు ప్రకాశములుగావు.” అని కాకునూరి అప్పయ్యలాక్షణికులవారు చెప్పినవాక్యములను వీరు దృఢముగా మనస్సునం దుంచుకొనియుందురు. చుట్టును గొండలచేతను నడవులచేతను గృష్ణానదిచేతను నావరింపఁబడి తక్కినదేశమునుండి వేఱైయున్న మాపల్నాటిసీమలోఁ బద్యరచనచేఁ బ్రజలయాదరమునుగాని