పుట:2015.370800.Shatakasanputamu.pdf/544

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

593


క.

ఇలలో దాతల నెన్నఁగ
ఫల మే మిఁక నిన్నుఁ జూడఁ బాల్పడితిని నా
బల మెఱుఁగ వేమి చెప్పుదు
వెలయఁగ పువ్వాడ మొండి వేంకటరెడ్డీ!

3


క.

బలిముఖుకైవడి నినుఁ గొని
చలమున నూరూరఁ బాత చెప్పతకలచే
నలగఁగఁ గొట్టుచుఁ ద్రిప్పెద
వెలయఁగ పువ్వాడ మొండి వేంకటరెడ్డీ!

4

ఈపద్యములలోని "వేంకటరెడ్డి” యనువారు రెడ్డికులజులనుభ్రాంతి కలుగవచ్చును గాని వైశ్యులే యని యెఱుంగనగును. ఈరీతి దూషణపద్యములకుఁగాని భూషణపద్యములకుఁ గాని విలువ యేమాత్ర ముండునో వేఱుగఁ జెప్పనక్కఱలేదు. వీనిని జల్పములలోఁ జేర్పవచ్చును. పార్వతీశముగారు సంస్కృతముకూడఁ గొంత చదివినట్లు కాన్పించుచున్నది. వీరు సంస్కృతభాషలో రామలింగాష్టకము, రామచంద్రాష్టకము నని రెండష్టకములు వ్రాసిరి. వీరు స్మారులు. వీరి శివభక్తిని విష్ణుభక్తినిఁ దులయం దిడి తూప విష్ణుభక్తివైపునకే ములు సూపును. ఈరీతి శివభక్తి, విష్ణుభక్తి యొక్కరియందుండుట మన మతచరిత్ర నెఱుఁగనివారికి విచిత్రముగా నుండును. అద్వైతమతవ్యాప్తిచేఁ గలిగిన ఫలమిది. పార్వతీశముగారు స్వగ్రామాభిమానసూచకముగా