పుట:2015.370800.Shatakasanputamu.pdf/5

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

ముగిసినను తిరుగ నొసంగకపోవుటకేగాక వంగూరు సుబ్బారావుగారు కీర్తిశేషులగుటకుఁ గూడ విచారించి మరల మొదలెత్తి చిరకాలముక్రిందట సంకల్పించిన శతకసంపుటప్రకటన మిప్పటికి సాగించితిమి. క్రమముగ వేఱువేఱుసంపుటములుగ భక్తి, శృంగార, నీతి, మతవిషయశతకములతో నింకఁ గొన్నిసంపుటములను బ్రచురింపనున్న మూయుద్యమమున కాంధ్రమహాజనులతో డ్పాటవసరము.

ఈసంపుటమునందు ముద్రితాముద్రితశతకములు రమారమి 20 సమకూర్చితిమి. ఇందలి యముద్రితశతకము లన్నియుఁ బ్రచురణార్థము మాకొసంగుటయేగాక శతకములనన్నింటిని సంస్కరించి విపులములగు పీఠికలు వ్రాసి శ్రీ శేషాద్రిరమణకవులు, శతావధానులు తోడ్పడుటచే నిప్పటి కీసర్వాంగసుందరమగు భక్తిరసశతక మొదటిసంపుటము ప్రచురింపఁ గలిగితిమి. ఆంధ్రమహాజనుల యాదరణ ప్రోత్సాహములఁ బట్టి కడమసంపుటములను గూడఁ ద్వరలోఁ బ్రచురించుటకుఁ బ్రయత్నింప నున్నారము.

తండయార్పేట,

ఇట్లు,

చెన్నపురి.

వావిళ్ల. రామస్వామి శాస్త్రులు

1-8-1926

అండ్ సన్స్.