పుట:2015.370800.Shatakasanputamu.pdf/489

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

536

మని యీకవి తలంపక తనకు భక్తిపారవశ్యమున నెటులఁ దోఁచిన నటులఁ బద్యములు వ్రాసియున్నాడు. కవి ఛందోనియమములు వ్యాకరణనిబంధనలు బొత్తిగాఁ బాటింపక యెటులో పద్యములు వ్రాసి తన భక్తిభావనమాత్రము ప్రకటించుకొనెను గాన నిందుఁ గొన్నిచోటుల నపశబ్దప్రయోగములు గలవు. వానిని సవరింతు మేని గణనియమము చెడి పద్యము నడకపోవుచున్నదిగాన వాని సంస్కరింపవీలైనది కాదు.

రామభక్తులు పెక్కం డ్రీశతకము భక్తిశ్రద్ధలతోఁ బఠించుటఁ జూచి జనాకర్షణమగు నీశతకమును కవ్యభిప్రాయానుగుణముగ ముద్రించితిమి.

నందిగామ

ఇట్లు భాషాసేవకులు,

5-3-26

శేషాద్రిరమణకవులు, శతావధానులు