పుట:2015.370800.Shatakasanputamu.pdf/488

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

రామతారకశతకము రచించినకవి పేరు నివాసము కాలము నెఱుంగనగు నాధారము లీశతకమున లేవు. ఈశతకములో తొంబది తొమ్మిది పద్యములు మాత్రమే కనుపించుటవలన నింకను గొన్నిపద్యములు లభింపవలసియున్నవనియుఁ బ్రత్యంతరసహాయమునఁ బరిశోధించిన కడమపద్యములతోఁబాటు కవిచరిత్రముగల పద్యముగూడ లభించు నేమోయని తోఁచుచున్నది. భాషాభిమానులగు సోదరులలో నీశతకమాతృకలు గలవారు మిగిలిన పద్యములను జూచి పంపుదురేని కృతజ్ఞతాపూర్వకముగఁ బరిగ్రహించి ప్రకటించెదము.

ఈశతకము వ్రాసినవాఁ డొకపరమభక్తుడు. శ్రీరామనామామృతపానముపై మక్కువ దీఱక తనకు వచ్చిరానికవితతో శతకము రచించి కృతార్థుఁడయ్యెను. ఈశతకకర్త కవితానైపుణ్యము గలవాఁడు కాడు. భావముల గ్రహించి సుశబ్దముల సమకూర్చి కవితాసుందరి నలంకరించుటయే కవికర్తవ్య