పుట:2015.370800.Shatakasanputamu.pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

484

మాన్యపరిచయముగలవాఁ డగుటచేఁ బద్యములలో భావలోపములు, శబ్దలోపములు, వ్యాకరణలోపములు విరివిగాఁ గనుపడుచున్నవి. సామాన్యజనులకు రామాయణకథ నెఱుంగఁజేయుట కీశతక ముపకరించును.

కవినివాసము కాలము కులము నిరూపింపఁదగిన యాధారము లీశతకమున లేకుంటచే శాఖాచంక్రమణము చేయవలసి వచ్చినది. ఇతఁ డాధునికుఁ డయియుండవచ్చును. “రాఘవేశ్వరుచారిత్రము నెంద ఱెన్నిగతులన్ వర్ణించినన్ గ్రాలదే” యన్నటుల పావనమగు రామకథ నెవ రెటుల వ్రాసినను బఠనయోగ్యమనుటలో నపవర్గదాయక మనుటలో ఆస్తికులు సంశయింపరు.

"ఛందము లక్షణం బెఱుగఁ జక్కఁగ ధైర్యముతోడఁ జెప్పితిన్, దొందర లేదు తప్పులని తోఁచిన” యని కవి తనశక్తిసామర్థ్యములు ధైర్యస్థైర్యములు స్వయముగఁ జెప్పికొనెను. తప్పులతడకగా నుండి పఠనయోగ్యము గాని పూర్వముద్రితప్రతుల సంస్కరించి ముద్దులొలుకునటు లీశతకము ముద్రించిన వావిళ్లవారు ఆంధ్రసోదరులకు స్మరణీయులు.

నందిగామ

ఇట్లు, భాషాసేవకులు,

8-8-26

శేషాద్రిరమణకవులు, శతావధానులు