పుట:2015.370800.Shatakasanputamu.pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈ ప్రసన్న రాఘవశతకము వ్రాసినది నరసింహకవియను నామాంతరముగల వంగూరి ముద్దునరసకవి. ఇతని తండ్రి పేరు లక్ష్మయ్య, ఈశతకమునందు రామాయణకథ యంతయు నిముడఁబడియున్నది. ఇందు రెండువందల పద్యములుంటచేఁ గవి దీని నొకమాఱు శతకద్వయమనిగూడ వ్యవహరించియున్నాఁడు.

రాక్షసులచే బీడింపఁబడి దేవతలు తమదురవస్థలు శ్రీమహావిష్ణునితో విన్నవించుట మొదలుకొని రాముఁడు సీతాసహితుఁడై పట్టాభిషిక్తుడగునంతవఱకుఁ గలకథ ప్రథానాంశములు పోవనీక యీశతకమున నిముడ్పఁబడియున్నది.

ఇక్కవి తాను సరసులు మెచ్చునట్లు వ్రాయుచుంటిననియు వరకవిననియుఁ జెప్పుకొనెనుగాని యీవిశేషణములకుఁ బుస్తకమునందుగల రచనమునకు సంబంధము లేదు. పద్యములలోఁ జాలతావుల యతిగణప్రాస లేకున్నవి. ధారయు తృప్తికరముగ లేదు. గణనియమమునకు లోనై శబ్దములనే తారుమాఱుఁ జేసి పద్యములలో నిమిడ్చికొనియున్నాఁడు.శతకకవులలోఁ గొందఱు లాక్షణికులయ్యు రసపారవశ్యముస వ్యాకరణనియమము లుల్లంఘించుటచే వారికవిత కది యలంకారముగనె చూపట్టుచున్నది. ఈకవి యట్లుగాక భాషావిషయమున సా