పుట:2015.370800.Shatakasanputamu.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాతృశతకము

315


ర్మలమతిఁ బుత్త్రవత్సలత రంజిలుతల్లినిఁ బోల రెవ్వరున్.

95


చ.

సరవిఁ గుమారవాంఛ కొనసాగుటకై పడువేవులింతనో
రరుచివిచేష్ట గాసి మొదలైనప్రయాసము లెల్లఁ జూడఁగా
హరిహరపంకజాసనముఖామరు లైననుగాని యిట్టిదు
ష్కరతర బాధ లోరువరు గావునఁ ద..

96


చ.

కడువడి మీఱ నందనుని గర్భములో భరియించి యింటిలో
నడిచెడివేళఁ దాఁ బనులునాణెముగా నొనరించువేళ నిం
పడరఁగఁ గూరుచుండు నెడనైన ప్రయాసము లోర్చెఁ గాన నీ
పుడమిని లోకమాత యనఁ బోలినత....

97


చ.

ప్రసవము నొందునాఁడు పడుబాములు చూచినఁ బ్రాణహానియై
యెసఁగినఁ గాని లోనఁ గసటెంతయు లేకయె పుత్త్రవాంఛలో
మసలెడుఁ గాన నింకిట సమానదయారసపూర్ణు లెవ్వ రీ
వసుమతిలోన దివ్యగుణవార్థినిఁ ద...

98


ఉ.

నేరుపు విద్యయుం గలిమి నీతివివేకము గల్గునట్లుగా
సారెకుఁ దెల్పుచో జగతి సౌఖ్యము గల్గ ఘటింపఁజేయుచో