పుట:2015.370800.Shatakasanputamu.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాతృశతకము

313


ర్జనసహవాస మేరికినిఁ జౌక ఘటించుఁ దలంచినన్ సుమా
విను మని బుద్ధి జెప్పుఘనవేణినిఁ దల్లినిఁ బోల రెవ్వరున్.

88


చ.

ధన మొనగూర్చు సద్గుణవితాన మొనర్పు ధరిత్రిలోపలన్
ఘనత ఘటించు రాజగురు కార్యసమున్నతిఁ జేయుఁ గీర్తికాం
తను గొని తెచ్చు ముక్తిపథతత్త్వము లెల్ల నెఱుంగఁజేయు స
జ్జనసహవాస మంచు నుడి సల్పెడుత...

89


చ.

అనయము రాజకార్యములయందుఁ బ్రవర్తన సేయువేళ భూ
జనులకుఁ గీడు పన్నునెడ సడ్డ ఘటింపఁగ నీకు లోకనిం
దన కెడగాని నిర్మలవిధంబు సమస్తము నీకుఁ గీర్తిసా
ధన మని తెల్పుసద్గుణమతల్లిని ద...

90


చ.

తలఁప సగణ్యుఁడై బుధవితానము వర్ణనచేయ సత్క్రియా
కలనఁ జెలంగి సద్గుణము గల్గిననుం దనుఁ గన్న తల్లితం
డ్రులగుణ మెల్లఁ బాయ భళిరే యనిపల్కుదు రంచుఁ బట్టికిం
దెలుపుచు సంతసిల్లుయువతీమణిఁ ద...

91


ఉ.

శిష్టులు మెచ్చ సజ్జనులు చేకొనునట్లు దలంచి జ్ఞానవా