పుట:2015.370800.Shatakasanputamu.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాతృశతకము

309


దలి నటు పెండ్లి చేసి యలదంపతులం గని మూఁడులోకముల్
చెలువుగ నేలినట్లు విలసిల్లెడుత...

72


చ.

చెలువము మీఱుచున్న తనచిన్నికుమారునిఁ జూచి మంత్రవా
దులు కలుషం బొనర్తు రని తోడనె పెద్దల నాశ్రయించి ని
ర్మలుఁ డగునట్లు చేయ హరిమంత్రములన్ బఠియింపఁ బూన్చి వా
రల కుపయు క్తిఁ జేయ నలరారెడుత...

73


చ.

కొమరుఁడు రాజకార్యములకున్ జని క్రమ్మఱ నింటఁ జేర రాఁ
దమక మెలర్పఁగాఁ బనులు తాల్మి ఘటించినఁగాని వందిత
క్రమ మిగురొత్త నందఱిని గాదని తాఁ దని వార నంద నా
భిమతము మీఱ భోజనముఁ బెట్టెడిత.....

74


చ.

కర మరుదార రాజహితకార్యములన్ సవరించి రా సభాం
తరమునఁ జేయుసత్క్రియలు దా విని తత్కమనీయకల్పనా
పరవశయై సదా "త్రిపురభంజన నేమ " మొసంగు మంచు మీ
సర మలరార దీవనలు సల్పెడుతల్లినిఁ బోల రెవ్వరున్.

75


ఉ.

భూరివివేకుఁడై సుజనపోషకుఁడై యభిమానుఁడై సదా
చారవిహారుఁడై పరమసాత్వికుఁడై గుణవంతు డయ్యు నేఁ