పుట:2015.370800.Shatakasanputamu.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

302

భక్తిరసశతకసంపుటము


ట్లనయము నాత్మఁ గుందుచుఁ దదాగమనాభిముఖాభిలాష పై
కొని కనినంత సంతసిలు కోమలిఁ ద...

44


చ.

చిఱుతలతోడ నాటలకుఁ జేతులు జాచుచు సందుగొందులం
బరుగులు పారుచున్న పశుబాధ ఘటించు నటంచు సాధ్వసా
తురమున రాణివాస మటు ద్రోసి బహిస్థలి కేఁగి యంత నా
బురుకనిఁ గేల నందికొని పోయెడుత...

45


చ.

కడువడి నెందఱిన్ గనినంగాని తనూజులు చెంతజేరి పైఁ
బడి మురిపంపుఁబెంపు నెఱబాధలు పెట్టినఁగాని వేసటం
బడక నితో౽ధికం బయినబాలురఁ గన్వలెనంచు బాళిలోఁ
బొడమి చరించుచుండు విరిబోణినిఁ ద...

46


చ.

విన వినఁ బాలు గాఱునెఱవేడుక మీఱఁగ ముద్దుముద్దుగాఁ
దనయుఁడు పల్కుచున్న విని తాఁ గనకం బొడిఁగట్టినట్లు నె
మ్మనమున సంతసిల్లుచును మాటికి మాటికి దృష్టి దీయుచోఁ
జను గుడిపించి మై నివురుచక్కనిత...

47


చ.

గునగున నేగుదెంచి తనకు న్మఱి పప్పులొసంగుమంచుఁ బ
ల్కిన నెఱముద్దుమాటలకుఁ గేవలము న్మది సొక్కి తద్వచో